దిశా అత్యాచార నిందితుడు చెన్నకేశవులు తండ్రి పరిస్థితి విషమం

Disha Accused Chennakesavulu Father Heavily Injured

దిశాపై అత్యాచారం చేసి హత్యా చేసిన ఘటనలో నిందితుడైన చెన్నకేశవులు స్వయంకృత అపరాధంతో ప్రాణాలు పోగొట్టుకుంటే , అతని తండ్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.  రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడు. ప్రస్తుత ఆయన పరిస్థితి విషమంగా ఉంది. షాద్ నగర్ వద్ద  దిశను  సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .. ఈ ఘటన జరిగిన తర్వాత దిశా హత్యాచార నిందితులను  ఎన్ కౌంటర్  చేశారు పోలీసులు. మొన్నటి వరకు వారి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండగా ఇటీవలే వారి మృతదేహాలను ఖననం చేశారు. ఇక ఇదే కుటుంబాన్ని ఇప్పుడు మరో విషాదకర సంఘటన కలచివేస్తుంది.

 దిశ కేసు నిందితుడు  చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య  ఈ రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నారాయణ పేట్ జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య  ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో కుర్మయ్య కు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. కుర్మయ్య పరిస్థితి విషమించడం తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు కొడుకు చావు మరిచి పోకముందే తండ్రి చావు బతుకుల మధ్యన ఉండడం ఆ కుటుంబాన్ని  విషాదంలో ముంచేసింది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article