రాసలీలల పృధ్వీపై దిశా చట్టం…

Disha Act against Prudhvi Raj

శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని నిర్వహించి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన కమెడియన్ పృధ్వీ తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే . ఆయన  మహిళా ఉద్యోగినితో సాగించిన  రాసలీలల ఆడియో బయటకు రావటంతో దుమారం రేగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన  టీటీడీ అనుబంధ ఆధ్యాత్మిక చానల్ లో చైర్మన్ అయిన ఆయన చేసిన పాడుపనిక సీఎం జగన్ సీరియస్ కావటంతో పాటు రాజీనామా చేయించాలని  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆదేశాలు ఇవ్వటంతో  ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేశారు. అయినప్పటికీ పృధ్వీ రాసలీలల వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా ఉద్యోగిని తో పృథ్వీ అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆరోపణల నేపధ్యం లో పథ్వీ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పృధ్వీ వ్యవహార శైలి ఇప్పటికే నచ్చని పలువురు ఉద్యోగులు తాజా పరిణామాల నేపధ్యంలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తే సరి పోదని దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన వాయిస్ ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టారని , అది తన వాయిస్ కాదని చెప్తున్న పృధ్వీ ఎలాంటి విచారణకు అయినా సిద్ధం అంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ  వేసి మరీ విచారిస్తుంది. షరా వేగంగా పృధ్వీ పై చర్యలు తీసుకుంది. కానీ మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన  పృధ్వీపై దిశా చట్టం పెట్టాలని డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది.

Disha Act against Prudhvi Raj,andhra pradesh, ttd, svbc, prudhvi raj, former chairman, sexual cntroversy, audio record, woman employee, disha act, employees protest 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article