“దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్”

మచిలీపట్నం:బందరు సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పి. రంజిత్ భాష ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు.

మహిళల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది, అందులో దిశ ఒకటి – జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు.

ఆపద వచ్చినప్పుడు ఒక అన్న లా సపోర్ట్ చేసే ఫామ్ దిశ యాప్ – జిల్లా కలెక్టర్

ఇంతకు ముందున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం డయల్ 100, డయల్ 112 కంటే దిశ SOS చాలా ఉత్తమమైనది మరియు వేగవంతమైంది – జిల్లా ఎస్పీ.

బందరు సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన “దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రంజిత్ భాష ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు, వాలంటీర్లు, వెలుగు గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు మరియు ఇతర సంఘాలకు చెందిన మహిళలు పాల్గొని భారీ స్థాయిలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article