దిశను హతమార్చిన చోటే  నిందితుల ఎన్‌కౌంటర్

274
Disha Case Accused
Disha Case Accused

Disha Case Accused Encounter

దిశ హత్యాచారం కేసులో నిందితులను  పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్ నగర్‌  చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద  పోలీసులు ఎన్‌కౌంటర్  చేశారు. దిశ నిందితులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు,  వారి వద్ద నుండి  కీలక ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో  ఎన్‌ కౌంటర్ చేసినట్టు సమాచారం.. పారిపోతున్న నలుగురు నిందితులపై కాల్పులు జరిపినట్లు  పోలీసులు తెలిపారు.  షాద్ నగర్ లోని  సంఘటనా స్థలంలోనే  దిశ  కేసులో  నిందితుల ఎన్ కౌంటర్ చేశారు.

నిన్న ఉదయం నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. ఇప్పటికే 7 బృందాల పోలీసులు ఈ కేసు విచారణలో నిమగ్నమై పని చేస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి సంఘటనా స్థలంలో  సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారి ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారని పోలీసులు నిర్ధారించారు.ఇదే విషయాన్ని కొద్దిసేపట్లో అధికారికంగా వెల్లడించనున్నారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరపక తప్పలేదని నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో, ఎక్కడైతే దిశను హతమార్చారో సజీవ దహనం చేశారో అక్కడే వారిని కూడా  ఎన్‌ కౌంటర్  చేశారు.

చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గర   దిశ అత్యాచారం,  మరియు  హత్య ఘటనకు సంబంధించిన నిందితులను ఎన్  కౌంటర్ చేశారు పోలీసులు.   నిన్న ఉదయం   దిశ కేసు  నిందితులను  కస్టడీలోకి తీసుకున్న పోలీసులు  రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు.  నిన్న రాత్రి   దిశను తగలబెట్టిన   చటాన్ పల్లి బ్రిడ్జి  సమీపంలోకి  సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి  నిందితుడు తీసుకొనివెళ్ళారు పోలీసులు.  నిందితులు పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం  చేశారు. పోలీసు వాహనాల మీద పోలీసుల మీద  రాళ్లు రువ్వారు. చటాన్ పల్లి  బ్రిడ్జి కింద   దిశను చంపిన స్థలంలోనే  పోలీస్ వాహనాల పైన  రాళ్లతో దాడి చేయగా,  పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.  దీంతో పోలీసులు తప్పించుకొని పారిపోతు, తిరిగి తమపై  దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం  నిందితులపై కాల్పులు జరిపి వారిని హతమార్చినట్లు గా తెలుస్తుంది.  ఈరోజు తెల్లవారుజామున  మూడు గంటల  నుండి 5:30  నిమిషాల మధ్యలో  ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గా  తెలుస్తుంది.  సంఘటనా స్థలానికి  సీపీ సజ్జనార్ చేరుకొని  అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.  అత్యంత పాశవికంగా  దిశ పై  సామూహిక అత్యాచారం చేసి,  హత్య చేసిన  నిందితులను  షాద్  నగర్ వద్ద పోలీసులు  ఎన్  కౌంటర్ చేయడంతో  తల్లిదండ్రులు  పోలీసులు చర్యను  అభినందిస్తున్నారు.  నిందితులకు తగిన శిక్ష పడిందని,  ఈ కేసులో న్యాయం జరిగిందని   దిశ తల్లిదండ్రులు  చెప్తున్నారు.  ఏది ఏమైనా  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి   దిశా కేసులో  త్వరితగతిన చార్జిషీటు ఫైల్ చేసి  దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పిన పోలీసులు చివరకు  ఎన్  కౌంటర్ చేయడం  రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Disha Case Accused Encounter,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here