ఆ రాక్షసులకు గరుడ పురాణమే కరెక్ట్‌ ట్రీట్‌మెంట్‌

Disha Rapists Must Hang To Death
దిశ హత్యాచార ఘటనపై ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయ్‌. వెటర్నరీ డాక్టర్‌పై పైశాచికత్వానికి పాల్పడిన నరరూప రాక్షసులకు మాములు శిక్షలు సరిపోవని… వాళ్లకి ​గరుడ పురాణంలో సూచించిన శిక్షలే కరెక్ట్‌ అంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీ.ఎస్‌. రంగరాజన్‌. నిందితులను రేపాసురులుగా ​సంబోధించాలన్నారు. ముక్కలు ముక్కలుగా నరికేయడమో… ఉరి తీయడమో చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనల్లో దోషులకు ఆరు నెలల్లోపు శిక్ష పడేలా ​చూడాలని వాళ్లకు అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించకూడదని వ్యాఖ్యానించారు. ​ ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని… మెజార్టీ ప్రజలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. 24 గంటల్లో అరెస్ట్‌ చేసిన ​పోలీస్‌లు ప్రశంసలకు అర్హులని.. కానీ కంప్లైంట్‌ నమోదు చేసే సమయంలో వారి ఆలసత్వం కరెక్ట్‌ కాదన్నారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రంగరాజన్‌ వారి ​బాధ వర్ణానతీతమని ఓదార్చడానికి మాటలు చాలడం లేదన్నారు. దిశ కుటుంబానికి సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. ​
కష్టాల్లో ఉన్న మహిళలను రక్షించడానికి ప్రతీ ఒక్కరు రామాయణంలో జఠాయులా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం బోల్డన్నీ చట్టాలున్నా అవేవీ ​వారిని రక్షించలేకపోతున్నాయని… యువత రక్షకుల్లా ఉండాలే కానీ రాక్షసుల్లా కాదన్నారు. ఇక దిశపై జరిగిన కర్కశత్వాన్ని ఖండిస్తూ ఇప్పటికే చిలుకూరు బాలాజీ ​దేవాలయాన్ని మూసేసి బాధితురాలికి సంతాపం ప్రకటించారు. ఆ సమయంలో భక్తులెవరికి దర్శనానికి అనుమతివ్వలేదు. అలాగే మహిళల భద్రతను కాంక్షిస్తూ ​దేవాలయం చుట్టూ మహా ప్రదక్షిణం చేశారు. ఆడవారిని గౌరవిస్తూ కన్యావందనం లాంటి కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *