రక్త పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ ప్రభుత్వ ఆదేశం

98
Do Blood Tests, Ordered By CSK Joshi
Do Blood Tests, Ordered By CSK Joshi

Do Blood Tests, Ordered By CSK Joshi

సీజనల్ జ్వరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు రక్త పరీక్షలను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి సి.యస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాదులు, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, యూరియా పంపిణీ , 2021 జనాభా లెక్కల సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, పార్ధసారధి, PCB కార్యదర్శి అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జ, చేనేత కమీషనర్ శైలజా రామయ్యర్ , PCCF శోభ , మున్సిపల్ డెరెక్టర్ టి.కె.శ్రీదేవి, వాకాటి కరుణ, మల్సూర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ లో వ్యాధి నివారణ చర్యలను విస్తృతం చేయాలన్నారు. ప్రస్తుత సీజన్ మలేరియా , టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. స్వైన్ ప్లూ నివారణ చర్యలను చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో isolated వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలెక్టర్లు తనిఖీ చేయాలన్నారు. అవసరమైన మందులు , కిట్లు పంపుతున్నామన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా వైద్య సేవల పై సమీక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతె State Control Room తో సంప్రదించాలన్నారు.

Telangana Health Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here