తండ్రి మాట కోసం అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశారో తెలుసా..?

Do you know what Asaduddin Owaisi did for his father

రామజన్మ భూమి బాబ్రీ మసీదు కు సంబంధించి అయోధ్య కేసు తుది అంకానికి చేరుకున్న సమయంలోఓ వైసీకి  సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీద్ కూల్చివేత అంశంపై ఢిల్లీలో 1993లో న్యాయపోరాటం మొదలైంది. అప్పటి నుంచి ఈ వివాదంలో ముస్లిం పిటిషనర్లకు 34 అశోక్ మార్గ్‌లోని ఓవైసీ బంగ్లా ఆశ్రయంగా మారింది. అయితే ఈ వివాద అంశంపై మతపరంగాను, రాజకీయ పరంగాను ఎలాంటి స్పష్టమైన అభిప్రాయం ఆయనకు లేకపోయినా ఈ అంశంపై ప్రధాన పిటిషనర్ జాఫర్యాబ్ జిలానీకి ఓవైసీ ఆశ్రయం కల్పించడం తాజాగా మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది . బాబ్రీ మసీదు, రామజన్మభూమి అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న జిలానీకి ఆశ్రయం, సహకారం అందించాలనే తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఒక్కమాటకు కట్టుబడి ఎంపీ అసదుద్దీన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి నుంచి జిలానీకి ఎలాంటి సహకారం కావాల్సి వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ సహకారం అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జిలానికి అసదుద్దీన్ ఓవైసీ అన్ని  రకాలు సహాయం అందిస్తున్నారు.
సుప్రీం కోర్టు తుది విచారణ జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని అసదుద్దీన్ అధికార నివాసం జిలాని, అతని అనుచరులతో కిక్కిరిసిపోయింది. అయితే ఇందులో మత, రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండి ఓవైసీ తన తండ్రి మాటకు విలువనివ్వడం గొప్ప విషయంగా మారింది. అయోధ్యలో రామ జన్మభూమి , బాబ్రీ మసీదు  వివాదాస్పద కేసు విషయంలో తన జోక్యం లేకుండా ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ  కేవలం తన తండ్రికి  ఇచ్చిన ఓ మాటకు మాత్రం కట్టుబడి ఉండటం మీడియాలో చర్చనీయాంశమైంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు విచారణ చివరి అంకానికి చేరుకొన్న సంగతి తెలిసిందే.

tags : ayodhya case, ram janma bhoomi, babree masjid, asaduddin owaisee, mim party, owaisi banglow, jilani

హుజూర్ నగర్ ఎవరి పరం?

 సుప్రీం లో అయోధ్య కేసు విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *