గ్లెనిగల్స్​ గ్లోబల్​ లో ఘనంగా డాక్టర్ల దినోత్సవం

216
Doctors Day is celebrated in Gleneagles Global
Doctors Day is celebrated in Gleneagles Global

నగరంలోనే ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైనా గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవం–2021 ఘనంగా నిర్వహించారు.

నగరంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ నిర్వహణ ఈ రోజు ‘డాక్టర్స్ డే 2021’ జరుపుకునేందుకు వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ పనులను సత్కరించింది. కొవిడ్​ –19 సంక్షోభంలో వారు చేసిన నిస్వార్ధ సేవల గుర్తింపుగా ఆస్పత్రిలోని 100 డాక్టర్లను, వైద్యసహాయక సిబ్బందిని సన్మానించారు.

ఈ సందర్భంగా గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ గౌరవ్ ఖురానా మాట్లాడుతూ, “డాక్టర్లు దేవుళ్లతో సమానమని, ఈ ప్రపంచ సంక్షోభం కాలంలో డాక్టర్లు చేసిన సేవలు మానవాళి ఉన్నంత కాలం, రాబోయే తరానికి గుర్తుండి పోతుందన్నారు. గ్లెనిగల్స్​ గ్లోబల్ హాస్పిటల్లో, ఒక సంవత్సరానికి పైగా, ప్రతి వైద్యుడు మరియు సహాయక సిబ్బంది కోవిడ్ -19 బాధితులకు మరియు ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు, మా ఆస్పత్రి యాజమాన్యం మా డాక్టర్లు, మరియు సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడి పని మరియు సేవలను గుర్తించి సన్మానించాలని నిర్ణయించింది. వీరి చొరవ లేకుంటే మేము వందలాది మంది ప్రాణాలను కాపాడటానికి సాధ్యమయ్యేది కాదు.” అని వివరించారు.

“ కరోనా అనే ఒక కంటికి కనపడని శత్రువుపై తమ జీవితాలను సైతం త్యాగం చేసిన, చేస్తున్న డాక్టర్ల సేవలు గుర్తుంచుకునే సందర్భం. తమ వృతి ధర్మం పరిధులను దాటి మానవత్వపు స్ఫూర్తిని సజీవంగా నిలబెట్టడానికి కృషి చేసిన డాక్టర్ల ను మేము సన్మానించుకున్నామన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఫ్రంట్​లైన్​ చేసిన వెలకట్టలేని ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో, కరోనా వ్యాప్తి చెందుతున్నప్పుడు, ఒక కొత్త రకం దేశ సైనికులు మొక్కవోని ధైర్యంతో నిలబడి మహమ్మారితో జరిగిన పోరాట సమయంలో తమ కుటుంబ సభ్యులను, ఆత్మీయులకు దూరంగా ఉన్నారు. ఎన్నో రకాల అసమానతలు భరిస్తూ సైతం డాక్టర్లు సేవలందించారు. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని పీపీటీ కిట్లు ధరించి ఎన్నో నెలల తరబడి కరోనాతో పోరాడిన డాక్టర్లు అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా సీఈవో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వివిధ విభాగాల అధిపతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here