ట్రంప్ లెక్కలకు జనాభాకు పొంతన లేదే

Donald Trump India visit Updates

నేను భారత్ వస్తే  అహ్మదాబాద్‌లో 5 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని వ్యాఖ్యానించి ట్రంప్ ఈసారి లెక్కలు మార్చేశారు. కోటిమంది స్వాగతం పలుకుతారని అన్నారు. కానీ భారత్ లో ట్రంప్ కు నిరాశ తప్పేలా లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ మొత్తం జనాభా 56 లక్షలు ఉంటే కోటి మంది ఎలా వస్తారని దీంతో ట్రంప్ ఆశలు నిరాశలు కాక తప్పదని అంటున్నారు. మీరు భారత్ వస్తే మీకోసం 5 లక్షల మంది మీకు స్వాగతం పలుకుతారని తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారనీ తెలిపిన ట్రంప్..5 లక్షల మందికాదు కదా కోటి మంది వచ్చినా తనకు సంతోషం కలగదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ భారత్ టూర్ పై ట్రంప్ అతిగా ఆశలు పెట్టుకుంటున్నారనీ..నా రేంజ్ అలా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఘన స్వాగతం ఉంటుందని అతిగా ఆశపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా భారత్ టూర్ లో భాగంగా ట్రంప్ రోజుకో వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు స్వాగతం పలకటానికి భారతీయులు లక్షలమంది వస్తారని ఓసారి.. కాదు కోటి మంది వస్తారంటూ  మరోసారీ ఇలా రోజురకమైన లెక్కలు చెబుతున్నారు. తనకు స్వాగతం పలికేందుకు 5 లక్షలమంది ప్రజలు వస్తారని మోడీ తనకు చెప్పారని అన్నారు. మరోసారి ఆ 5లక్షల్ని ఏకంగా 10 లక్షలని ..కాదు కాదు 70లక్షలు అని ఇంకోసారి ఇలా రోజుకోరకమైన లెక్కలు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ 70లక్షల్ని 10 మిలియన్స్ అంటే  కోటి మంది వస్తారని తనకు మోడీ మాట ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాగా మోడీ నిజంగా ట్రంప్ కు మాట ఇచ్చారా?ట్రంప్ తనకు తానే ఓ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .
Donald Trump India visit Updates,#Trump,#hmadabad, bharat,#modi, prime minister,1 crore people,Laksh Of Peoples,Trump Inda Tour Updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article