నెగటివ్ వచ్చిన 14 రోజులకు రక్తదానం

107

రాష్ట్రంలో తగ్గిపోతున్న రక్త నిల్వలను పెంపొందించడానికి రక్తదాన శిబిరాల్ని చేయడం అత్యవసరమని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ.వై తెలిపారు. నానక్ రాంగూడ చౌరస్తాలోని ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీలో ‘ట్రెడా’ ఆరంభించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియా పేషెంట్లతో పాటు గుండె ఆపరేషన్లు, జనరల్ సర్జరీలు, మెటర్నిటీ పేషెంట్లకు అవసరమయ్యే రక్తాన్ని సేకరించి వారి ప్రాణాల్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి లేదా రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తరువాత రక్తదానం చేయవచ్చన్నారు. ఆర్ టీ పీసీఆర్ లో నెగటివ్ వచ్చిన పద్నాలుగు రోజులయ్యాక కూడా రక్తాన్ని దానం చేయవచ్చని తెలిపారు. డాక్టర్లు, నర్సులు కొవిడ్ వారియర్లు కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తారని చెప్పారు. శుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడరని అన్నారు. ఒక వ్యక్తి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్ మొత్తం శానిటైజ్ చేశాకే మరో వ్యక్తిని అనుమతిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు మాజీ జీఎం రవికుమార్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ సంఘం సభ్యులు, ఇతర నివాసితులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here