111 జీవోలో కొనవద్దు

dont buy in 111 go areas, says experts

కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికో మరెందుకో తెలియదు కానీ.. తెలంగాణ ప్రభుత్వం 111 జీవోలో కొన్ని పేరాలను మార్చివేసింది. దీంతో, కొందరు ఆ జీవోను ప్రభుత్వం ఎత్తివేసిందని భావిస్తున్నారు. మరి, జీవో ఎత్తివేస్తే ప్రభుత్వం ఎందుకు అధికారికంగా అనుమతిని మంజూరు చేయట్లేదు? ఎందుకు కొత్త నిర్మాణాలకు అనుమతినివ్వట్లేదు? తాంబూలిచ్చాం.. తన్నుకు చావండి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ జీవోపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో నిర్మాణ రంగం స్తంభించింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలా? లేక కొంతదూరం వెళ్లి అయినా విల్లాలు కట్టుకోవాలా? అని కొనుగోలుదారులు ఆలోచిస్తున్నారు. సందిట్లో సడేమియాలా.. కొందరు అక్రమార్కులు ఏకంగా వెంచర్లను వేసి.. గజానికి నలభై నుంచి యాభై వేల చొప్పున ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొన్ని రిసార్ట్ సంస్థలు రేటును పెంచేసి ప్లాట్లను అమ్ముతున్నాయి. ఏదీఏమైనా, రాత్రికి రాత్రే అద్భుతం జరిగే అవకాశం లేదు కాబట్టి, తొందరపడి ట్రిపుల్ జీవో ప్రాంతంలో ప్లాట్లు కొనకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article