జీ స్క్వేర్ వేధింపులు మాములుగా లేవు

Dont buy plots in G Square, Said TS Rera

చెన్నైకి చెందిన జీ స్క్వేర్ అనే సంస్థ చౌటుప్ప‌ల్‌లో 1200 ఎక‌రాల్లో ఎపిటోమ్ అనే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ క్ర‌మంలో 200 ఎక‌రాల్లో ప్లాట్ల‌ను అమ్మ‌డానికే రెరా అనుమ‌తిని తీసుకుంది. కానీ, మొత్తం ప‌న్నెండు వందల ఎక‌రాల‌కు రెరా అనుమ‌తి ల‌భించిన‌ట్లు ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంది. ఈ అంశంలో రికార్డుల‌ను ప‌రిశీలించ‌గా.. కేవ‌లం 200 ఎక‌రాల‌కే అనుమ‌తి తీసుకున్న‌ట్లు రెరా గుర్తించింది. అందుకే, ఈ సంస్థ వ‌ద్ద ప్లాట్లు కొనేవారు ఏయే ఫేజులో కొంటున్నార‌నే విష‌యాన్ని తెలుసుకున్నాకే సొమ్ము చెల్లించాల‌ని రెరా చెబుతోంది. స‌ర్వే నెంబ‌ర్ 493లోని దేవుల‌మ్మ న‌గ‌ర్ గ్రామంతో పాటు మొత్తం వెయ్యి ఎక‌రాల్లో వేసిన ప్లాట్ల‌ను కొన‌వ‌ద్ద‌ని చెబుతోంది. అయితే, ఈ సంస్థ ఇప్పటికే అక్కడి చుట్టుపక్కల రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోందని సమాచారం. ఈ వెంచర్ కు ఇరువైపులా ఉన్న రైతుల భూముల్లోకి వెళ్లనీయడం లేదు. దీంతో, ఇప్పటికే స్థానికులు ఈ సంస్థ ఓనర్ బెంజ్ కారును ధ్వంసం చేశారని తెలిసింది. బీజేపీ పార్టీ కేంద్ర నాయకులు తమకు దగ్గర అంటూ ఈ సంస్థ అందర్ని భయాందోళనలకు గురి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ సంస్థ అనుమతిని రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article