ఈ సంస్థ‌ల వద్ద ప్లాట్లు కొన‌వ‌ద్దు

Dont buy plots in this companies, warns TS Rera

Dont buy plots in this companies
Dont buy plots in this companies

రెరా చ‌ట్టం 2016 సెక్ష‌న్ 3(1), 4 (1) ప్ర‌కారం.. దాదాపు 13 సంస్థలకు ఎలాంటి అనుమ‌తుల్లేవ‌ని రెరా అథారిటీ తెలియ‌జేసింది. రెరా చ‌ట్టంలోని సెక్ష‌న్‌ 3(1) ప్ర‌కారం.. రెరా అనుమ‌తి లేకుండా ఎలాంటి ప్లాటు కానీ ఫ్లాటు కానీ విక్ర‌యించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక నుంచి రెరా అనుమ‌తి లేని వెంచ‌ర్ల‌లో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు విక్ర‌యించ‌కూడ‌ద‌ని.. అలా అమ్మే వాటిలో కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య స‌ముదాయాల్లో కొనుగోలు చేసేవారు.. వాటికి రెరా అనుమ‌తి ఉందా? లేదా? అనే విష‌యాన్ని రెరా వెబ్‌సైటులో తెలుసుకున్నాకే ముంద‌డుగు వేయాల‌ని సూచించింది. ఇందుకోసం రెరా వెబ్‌సైటు (https://rerait.telangana.gov.in /SearchList /Search)ను చూడాల‌ని కోరింది.

  •  న‌గ‌రానికి చెందిన యోషితా ఇన్‌ఫ్రా స‌దాశివ‌పేట్ టౌన్లో వేసిన వెంచ‌ర్‌లో ప్లాట్ల‌ను కొన‌వ‌ద్ద‌ని రెరా చెబుతోంది. అదే విధంగా, యూనిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ పిగ్లీపూర్ గ్రామం, 17/1 స‌ర్వే నెంబ‌ర్ వేసిన వెంచ‌ర్‌, సూర్యాపేట్ వ‌ద్ద ఎలైట్ సాయి డెవ‌ల‌ప‌ర్స్ వంటి వెంచ‌ర్ల‌లో ప్లాట్లు కొన‌కూడ‌ద‌ని అంటోంది. రెరా సిద్ధం చేసిన జాబితా ప్ర‌కారం.. ఇంకా ఏయే వెంచ‌ర్ల‌లో ప్లాట్లు కొన‌కూడ‌దంటే..
  •  అలేఖ్య ఇన్‌ఫ్రా డెవ‌ల‌ప‌ర్స్ సంగారెడ్డి, కేవీఎస్ హోమ్స్, పిల్ల‌ల‌మ‌ర్రి గ్రామం, సూర్యాపేట్ స‌ర్వే నెం. 174, జీ స్క్వేర్‌, దేవుల‌మ్మ గ్రామం, స‌ర్వే నెం 493, అలేఖ్య ఎస్టేట్స్‌, పెద్దాపూర్‌, స‌ర్వే నెంబ‌ర్లు 497/బి, 498 and 499/బి, సంగారెడ్డి, అక్షితా ఇన్‌ఫ్రా, సూర్యాపేట్‌, విజ‌య‌వాడ హైవే, విశ్వ డెవ‌ల‌ప‌ర్స్‌, రాజ‌పూర్, స‌ర్వే నెం. 50/పి, 140/పి, 141/పి, 101 ఎక‌ర్స్‌, ఫార్మా ఎలైట్‌, అమేజ్‌, ఫార్మా నేచ‌ర్ సిటీ నందిప‌ర్తి, యాచారం, భువ‌నతేజ ఇన్‌ఫ్రా, ఆర్‌జే హోమ్స్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ వెంచర్లు, అపార్టుమెంట్లు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article