Don’t Talk Rubbish
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి డీ సెంట్రలైజేషన్ బిల్లు పై చర్చ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహావేశాలన్ని ప్రదర్శించారు. రాజధాని భూములపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ను కోరారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇక ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మధ్యలో టీడీపీ సభ్యులు అడ్డుతగలడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించే అధికారం స్పీకర్ కు లేదని ప్రతిపక్ష నేతలు అనడం సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన స్పీకర్ ‘చెత్తవాగుడు ఆపెయ్..’అంటూ టీడీపీ నేతలపై ఫైరయ్యారు.
డోంట్ టాక్ రబ్బిష్ అంటూ విరుచుకుపడ్డారు. సభలో ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపించాలనే అధికారం నాకు లేదా అంటూ ఫైర్ అయ్యారు. నన్ను డిక్టేట్ చేస్తారా అని ప్రశ్నించారు. స్పీకర్ వినతిపై స్పందించిన సీఎం జగన్.. మీరు న్యాయమూర్తిలాంటి వారు.. మీ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అయితే మీకేం అధికారం ఉందంటూ స్పీకర్ను ప్రశ్నించిన అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స సత్యన్నారాయణ . దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.