గెలిచి పని చెయ్యకుంటే తీసివేతలే

Don’t vote for caste or religion: KTR

తెలంగాణా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో ప్రచారం జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక వేములవాడలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేములవాడలో పర్యటించిన ఆయన పనిచేసే నాయకులకే ఓటు వేయాలని ప్రజలను అర్థించారు. అయితే, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సరిగా పనిచేయకపోతే వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే నాలుగేళ్లలో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణను ముందుకు తీసుకెళతామని, పట్టణాలను అద్భుతమైన రీతిలో అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ విపక్షాలపైనా విమర్శలు చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు పనికంటే మాటలు ఎక్కువని, అలాంటి వాళ్లకు ఓటు వెయ్యడం వృథా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు

Don’t vote for caste or religion: KTR,telangana, municipal elections, trs party vemulawada, campaign , bjp, congress ,minister KTR

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article