కేసీఆర్ కు డీఎస్ షాక్

DS SHOCKED CM KCR

పొమ్మనకుండా పొగ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ డీఎస్ ఇక టీఆర్ ఎస్ కు దూరమే అని అందరూ భావించారు. కానీ ఆయన ఇంత కాలం సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీ డిఎస్ బుధవారం నాడు హాజరయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇక పార్టీ కి దూరంగా ఉంటారని భావించినా ఆయన చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డిఎస్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కవిత ప్రోద్బలం తోనే డీఎస్ పై విరుచుకుపడ్డారని అప్పట్లో చర్చ జరిగింది. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఆయన కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డిఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి కవితపై విజయం సాధించారు. ఇక దీంతో డీఎస్ ఫ్యామిలీ బీజేపీ వైపే అని అనుకున్నారు. అరవింద్ గెలుపు వెనుక డిఎస్ కూడ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు డీఎస్ టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు.ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

Tags : Telangana, KCR , D.Srinivas, trs, trs parliamentary party meeeting, ds attend,

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article