Sunday, April 6, 2025

రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా విడాకులు..

ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకుల ప్రకటన

దుబాయ్ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురి విడాకుల అంశం ఆసక్తికరంగా మారింది. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తో 2023 మే 27న యువరాణి షైకా పెళ్లి జరిగింది.

రెండు నెలల క్రితమే షైకా, మనా దంపతులకు మొదటి సంతానం కలిగింది. ఇంతలోనే మనాకు విడాకులు ఇస్తున్నట్లు యువరాణి షైకా ప్రకటించింది. సోషల్ మీడియా వేధిక ద్వారా విడాకుల ప్రకటన చేసింది షైకా.

 

అమె తన ఇన్ స్టాగ్రామ్ లో.. ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు.. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను.. ఇట్లు మీ మాజీ భార్య షైకా.. అంటూ పోస్టు చేసింది. అంతే కాదు తామిద్దరూ కలిసి దిగిన ఫొటో లను ఇన్ స్టా నుంచి డిలీట్ చేసేసింది.

దుబాయ్ యువరాణి షైకా లండన్ లోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంటర్నేషనల్ రిలేషన్ షిప్ కోర్చు చదువుకున్నారు. దుబాయ్ లో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు షైకా. వీరిద్దరి విడాకుల అంశానికి సంబందించి అంతర్జాతీయ మీడియా పలు కధనాలను ప్రచురించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com