దుబ్బాక ఎన్నికలకు సిద్ధం

47
Dubbaka Elections Live
Dubbaka Elections Live

Dubbaka Elections Live

దుబ్బాక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్బెర్వర్లు, సీసీ కెమెరా, వీడియోలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. సుమారు 3600 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఓటు హక్కుపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించారు. మొదటి సారి ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది, 80 సంవత్సరాలు, దివ్యాంగులు, కోవిడ్ రోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. అన్ని నిబంధనలతో పోస్టల్ బ్యాలెట్ చేస్తున్నారు. 130 మంది కోవిడ్ రోగులు ఉన్నారు వారికి పోస్టల్ బ్యాలెట్. 10 చెక్ పోస్ట్ లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

కోవిడ్ రోగులు లాస్ట్ గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు వేసేందుకు వచ్చే కోవిడ్ రోగులకు పిపిఈ కిట్లు. దుబ్బాక లో 1 లక్ష 98 వేల 756 ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం 58 లక్షల నగదు, 58 వేల విలువైన ఆభరణాలను పట్టుకున్నారు. జిల్లా పరిధిలో దుబ్బాక ఉప ఎన్నిక కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. డబ్బుకు, మందుకు లొంగకుండా ఓటు వేయాలి.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుంది.144 సెక్షన్ సాయంత్రం 6 గంటల నుండి 4వ తేదీవరకు ఉంటుంది. 89 సమస్యాత్మక ప్రాంతాల్లో 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తింపు. ఇందులో కేంద్రాల బలగాలు బందోబస్తు ఉంటారు. 2 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. పోస్ట్ పోల్ కోసం 14 టీం లు పెట్టారు, ఫిర్యాదులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. పోలింగ్ రోజున వంద మీటర్ల లోపు పార్టీ ప్రచారం, జెండాలు ఉండకూడదు. దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.

Dubbaka Elections Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here