దుబ్బాక ఎమ్మెల్యే కన్నుమూత

38
Dubbaka Mla Expired
Dubbaka Mla Expired

Dubbaka Mla Expired

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో హార్ట్ ఎటాక్ తో ఆయన చనిపోయారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతో ఆయన బాధపడుతున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామలింగా రెడ్డి గురువారం ఉదయం మరణించారు. దీంతో, ఆయన అభిమానులు, నియోజకవర్గ వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన హఠాత్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని.. ఒక గొప్ప నాయకుడిని, మంచి మనిషిని కోల్పోయామని తెరాస శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

Dubbaka Mla Dead

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here