సోలిపేట సుజాతనే టీఆర్ఎస్ అభ్యర్థి

33
Dubbka Trs Candidate Solipeta Sujatha
Dubbka Trs Candidate Solipeta Sujatha

Dubbka Trs Candidate Solipeta Sujatha

ఊహించినట్టుగానే సోలిపేట సుజాతను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దుబ్బాక అసెంబ్లీ నియోజకర్గానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత బరిలో దిగనుంది. మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని, ఉద్యమం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని గుర్తు చేశారు. రామలింగారెడ్డి కుటుంబం ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే ప్రాతినిథ్యం వహించడం సమంజసం అని సీఎం అన్నారు.

జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చింది. టికెట్‌ ఇస్తాం… పోటీ చేయాలంటూ… శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత పేరు ఖరారు కావడంతో…చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవేళ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చుంటే దుబ్బాక ఎన్నిక రసవత్తరంగా ఉండబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here