‘యుద్ధం’ ప్రేమకథతో తెలుగులోకి దుల్కర్

62
Dulkar new movie
Dulkar new movie

Dulkar new movie

సౌత్ లో ఇప్పుడు సరికొత్త తరం హవా మొదలైంది. అన్ని భాషల్లోనూ థర్టీ ప్లస్ స్టార్స్ దుమ్మురేపుతున్నారు. అలాంటి వారిలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్న హ్యాండ్సమ్ కుర్రాడు దుల్కర్ సాల్మన్ ఒకడు. మళయాల మెగాస్టార్ మమ్మూట్టి తనయుడుగా వచ్చిన దుల్కర్ చాలా తక్కువ టైమ్ లోనే టాలెంట్ తో స్టార్ అనిపించుకున్నాడు. ఓకే బంగారం, మహానటితో మనవారినీ ఆకట్టుకున్న దుల్కర్ ఈ సారి ఏకంగా తెలుగులోనే స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. ఇవాళ దుల్కర్ బర్త్ డే. ఈ సందర్భంగా తన తెలుగు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దుల్కర్ సాల్మన్.. తండ్రి మమ్మూట్టి లాగానే స్టార్డమ్ కోసం కాకుండా.. మంచి నటన చూపుతూ.. అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో. కెరీర్ తొలినాళ్లలోనే వైవిధ్యమైన పాత్రలు చేసి సత్తా చాటాడు. చాలా తక్కువ టైమ్ లోనే తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సాల్మన్ బెంగళూర్ డేస్ సినిమాతో సౌత్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులో లేని ఆ టైమ్ లో కూడా ఈ సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా వెదికి మరీ చూశారు.
దుల్కర్ సాల్మన్ మంచి అందగాడు. చూడగానే హీరోలా ఉన్నాడు అనిపిస్తాడు. అందుకే తెరపై ఆ హీరోయిజం చాలా త్వరగా ఆకట్టుకుంది. బెంగళూర్ డేస్ తర్వాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత ఏకంగా మణిరత్నం తన రొమాంటిక్ హీరోగా దుల్కర్ ను తీసుకున్నాడు.

నిత్యమీనన్ హీరోయిన్ గా నటించిన ఓకే కన్మణి చిత్రాన్ని తెలుగులో ఓకే బంగారం అంటూ డబ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా దుల్కర్ ను నాని చెప్పిన డబ్బింగ్ తో అతనూ తెలుగు కుర్రాడేనా అనిపించాడు. మహానటిలో జెమినీ గణేశన్ పాత్రలో అలవోకగా ఒదిగిపోయాడు. పైగా తన పాత్రకు ఈసారి తనే డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంత మెప్పించిందో.. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మహానటి తర్వాత దుల్కర్ కు తెలుగులో కూడా అభిమానులు ఏర్పడ్డారు. సౌత్ తో పాటు హిందీలోనూ సత్తా చాటిన దుల్కర్ రీసెంట్ గా ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు. తన 25వ సినిమాగా వచ్చిన ఆ మూవీ కనులు కనులను దోచాయంటే. 25వ సినిమా కదా అని హీరోయిజం చూపించకుండా పూర్తిగా కథకు సరెండర్ అయిన దుల్కర్ ఈ సినిమాతో మళయాలంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం అందుకున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా టివిలో ప్రసారమైంది. ఏకంగా 7కు పైగా రేటింగ్ సాధించింది.

ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడం ఫస్ట్ టైమ్ కావడం.. దుల్కర్ కు తెలుగులో ఉన్న ఆదరణకు నిదర్శనం. దుల్కర్ కు తెలుగులో క్రేజ్ వచ్చిందని కనులు కనులను దోచాయంటే నిరూపించింది. అందకే ఎవరూ ఊహించని విధంగా ఈ సారి నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తన మహానటి నిర్మాతలు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ పై ఓ మూవీతో రాబోతున్నాడు. లెఫ్ట్ నెంట్ రామ్‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’అనే టైటిలో తో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. బర్త్ డే సందర్భంగా అటు మళయాలంలో చేస్తోన్న కురుప అనే సినిమా టీజర్ కూడా విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఈ రెండు సినిమాలూ  పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతున్నట్టు తెలుస్తోంది. సో.. ఈ మూవీస్ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ కు బర్త్ డే విషెస్ చెబుదాం..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here