దుర్గగుడిలో తలసాని వ్యాఖ్యలను తప్పుపడుతున్న

Durga Temple Talasani Sensational Comments

తెలంగాణ రాష్ట్ర మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలోని దుర్గమ్మ గుడి సన్నిధిలో చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆలయ ఆవరణలో రాజకీయాలు మాట్లాడడాన్ని ఆలయ పాలకమండలి తప్పుబడుతోంది.సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ గుడి సన్నిదిలో మీడియాతో మాట్లాడిన సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని…అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని మాట్లాడారు.దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడాన్ని ఆయన దుర్గ గుడి పాలకమండలి తప్పుబడుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుతున్న ఆలయ సిబ్బంది వారించకపోవడాన్ని పాలకమండలి తప్పుబడుతోంది.దుర్గమ్మ సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని పాలకమండలి డిమాండ్ చేస్తోంది.తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పాలకమండలి సభ్యులు చెబుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article