ఆకతాయిలకు అడ్డాగా తీగల వంతెన

41
Durgam cheruvu, Cable bridge
Durgam cheruvu, Cable bridge

Durgam cheruvu, Cable bridge

హైదరాబాద్ దుర్గం చెరువుపై ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తీగల వంతెన ఆకతాయిలకు అడ్డగా మారుతోంది. హైదరాబాద్ ఘనతను పెంచేందుకు, ట్రాఫిక్ ను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించింది. ట్రాఫిక్ బాధలు ఏమోకానీ.. ఆకతాయిలకు అడ్డగా మారుతోంది. వంతెన అందుబాటులోకి వచ్చిన రోజు నుంచే సెల్ఫీ స్పాట్ గా మారింది.

వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నా యువతి యువకులు సెల్ఫీలు దిగుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ డేంజర్ జోన్ గా మార్చారు. రోడ్డుకు అడ్డంగా నిలబడటం, ప్రమాదకరంగా ఫొటోలకు ఫోజులివ్వడం, డివైడర్లపై ఎక్కడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా బట్టలు విప్పి దిగిన వీడియోలు వైరల్ గా మారాయి. పోలీసులు రాగానే అక్కడ్నుంచి పరారయ్యాడు. పగలు, రాత్రి తేడా లేకుండా తీగల వంతెన ఆకతాయిలకు అడ్డగా మారింది. పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా పోకిరీలు లెక్క చేయడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here