ఇక నుంచి ఈ పాస్ తప్పనిసరి

41

E-PASS IS MANDATORY, SAID AP DGP,#APDGP GOWTHAM SAWANG,#AP DGP GOWTHAM SAWANG CLARITY ON E-PASS

కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్(@ APPOLICE100), ఫేస్ బుక్(@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి దృవ పత్రలతో ఈ-పాస్ వినియోగించుకోవాలని కోరారు.

శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణం మేరకు సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రలతో అనుమతి పొందాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల రక్షణ కోసం వారి వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు. అంతరాష్ట్ర రాక పోకలపై నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here