ఈస్ట్ కోస్ట్ ఎక్కుతోన్న నాగశౌర్య

East Coast Productions and Naga Shourya team up

తెలుగులో ఉన్న చాలామంది యంగ్ స్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. కాకపోతే ఎటొచ్చీ కుర్రాడి స్టేజ్ బిహేవియర్ బావోదు అనే టాక్ మాత్రం ఉంది. అవన్నీ పక్కనబెడితే.. లేటెస్ట్ గా అశ్వథ్థామతో విజయం అందుకున్నాను అనుకుంటున్నాడు. అంటే ఆ బిజినెస్ లెక్కలన్నీ అతనే చెబుతున్నాడు. తమ సొంత బ్యానర్ లో వచ్చిన సినిమా కాబట్టి ఈ లెక్కలన్నీ సీరియస్సా కాదా అనేది కూడా వాళ్లకే వదిలేస్తే సరి. ఇక నిన్ననే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా ప్రారంభించాడు శౌర్య. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది.
కళ్యాణ్ రామ్ తో ‘118’అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన మహేష్ కోనేరు తన బ్యానర్ కు ఈస్ట్ కోస్ట్ అనే పేరు పెట్టుకున్నాడు. 118తో కమర్షియల్ గా మంచి విజయాన్నే బ్యాగ్ చేసుకున్న మహేష్ ప్రస్తుతం  కీర్తిసురేష్ హీరోయిన్ గా ‘మిస్ ఇండియా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాగశౌర్యతో మరో మూవీకి సిద్ధమవుతున్నాడు. రాజా అనే కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ తో పాటు ఇతర విషయాలన్నీ త్వరలోనే చెబుతారట.

ఏదేమైనా తనే బ్యానర్ స్థాపించుకుని విజయాలు అందుకుని ఆ విజయాలతో ఇతర బ్యానర్స్ ను ఆకర్షించి.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు శౌర్య. అంతా బానే ఉంది కానీ.. అతనిపై మరో నింద కూడా ఉంది. బయటి బ్యానర్ లో చేసే సినిమాల ప్రమోషన్స్ లో పెద్దగా చొరవ పెట్టడు అని. అది కాస్తా పోగొట్టుకుంటే ఇంకా మంచి బ్యానర్స్ లో సినిమాలు చేసే ఛాన్స్ ఉందీ కుర్రాడికి.

East Coast Productions and Naga Shourya team up,#East Coast Productions,Naga Shourya Latest Movie Updates,Miss India Director For Shourya,mahesh koneru

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article