ఈబీసీ బిల్లుకు రాజముద్ర

EBC Bill will Considers by President

  • ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి సంతకం
  • అమల్లోకి వచ్చిన అగ్రవర్ణ పేదల కోటా

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈబీసీలకు 10 శాతం కోటాపై గెటిజ్ విడుదలైంది. దీంతో ఇకపై అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఎన్నికల నేపథ్యంలోనే మోదీ సర్కారు ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్షాలు ఆరోపించినప్పటికీ, రెండు మూడు పార్టీలు మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలపడంతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండింత మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. ఆయన శనివారం బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు చట్టరూపం దాల్చింది. కాగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. దీని ప్రకారం.. వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు… అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు… నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు… నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు రిజర్వేషన్‌ పొందేందుకు అర్హులు అవుతారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article