Banks plays key role in Indian Economy

Banks plays key role in growth of Indian Economy

దేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల పాత్ర ఎంతో కీలకం. మన రోజు వారి వ్యవహారాల్లోనూ వీటి స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి ప్రాధాన్యత రంగంలో మదుపు చేయడం ద్వారా లాభాలు అందిపుచ్చుకునే అవకాశం వస్తే …ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్తగా ప్రారంభించినా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పథకం సరిగ్గా ఈ కోవకు చెందిందే…

గత కొద్ది కాలంగా స్టాక్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో బ్యాంకింగ్ సంస్థల షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కొంత సంక్షోభంలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ రంగానికి ఉన్న విస్తృత అవకాశాలను తోసిపుచ్చలేము. బ్యాంకుల వడ్డీ రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో వీటి లాభాల్లోనూ ఇప్పడు కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది. పైగా రానున్న కొద్ది రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే ఈ రంగం వేగంగా లాభాల బాటలోకి వెళ్తుందని ఆశించవచ్చు.

ఈ రంగం ఎలా పని చేస్తుంది…?

ఇది పూర్తిగా ఒకే రంగానికి పరిమితమైన పథకం. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో ఉన్న భీమా, అసెట్ మేనేజ్ మెంట్ టర్మ్ లెండింగ్ తదితర సంస్థల్లో ఇది పెట్టుబడి పెడుతుంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పటికీ, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల తక్కువలో లభ్యమవుతున్న కంపెనీల షేర్లలో ఎక్కువగా మదుపు చేస్తారు. దీని వల్ల రోజుల్లో మంచి లాభాలకు ఆస్కారం ఉండేలా ప్రయత్నిస్తారన్నమాట. మొత్తం సమీకరించిన నిధుల్లో సింహ బాగాన్ని ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఈక్విటీ, ఈక్విటీ ఆథారిత ఇతర పథకాలలో మదుపు చేస్తారు. మిగిలిని మొత్తాన్ని డెట్ లేదా, మనీ మార్కెట్లో పెడతారు. పెట్టబడి మొత్తాన్ని ఒకేసారి కాకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ విధానంలో పెట్టడం ఈ ఫండ్ ప్రత్యేకత.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article