చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు

గతంలో గుడివాడ కెసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్న ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాల్ని నిర్వ‌హించింది. అదేవిధంగా, బోయిన పల్లిలో మాధవరెడ్డి ఇంటి ఫై ఈడీ సోదా చేసింది. జూన్ 10 నుంచి 13 తేదీల్లో నేపాల్ లోని హోటల్ మేచీ క్రౌన్ లో కేసీనోను మాధ‌వ‌రెడ్డి నిర్వ‌హించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్ కు పేకాట రాయిళ్ళ తరలించారు. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాల్ని నిర్వ‌హించారు. ఆయ‌న నేపాల్ , ఇండోనేషియా పుక్కెట్ లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. పైగా, క్యాసినోలలో టాలివుడ్ డ్యాన్స‌ర్లు చిందులు వేశారు. ఆయ‌న మీద ఈడీ ఫెమా కింద కేసు న‌మోదు చేసింది. హైద్రాబాద్ లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాల్ని నిర్వ‌హించింద‌ని స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article