ఈడీ ముందు హాజరు కావాలని రేవంత్ కు నోటీసులు

ED SUBMITED NOTICES TO REVANTH REDDY

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోలేని రేవంత్ రెడ్డికి మరోషాక్ తగిలింది. వారంలోగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో సంబంధం ఉన్న వేం నరేందర్ రెడ్డిని, ఆయన ఇద్దరు కుమారులను మంగళవారం ఈ డి వేర్వేరుగా విచారించింది. వేం నరేందర్ రెడ్డి ఆస్తులు వ్యవహారాలు, స్టీఫెన్ సన్ కు ఇవ్వ చూపిన 50 లక్షల రూపాయల వంటి అంశాలపై అటు వేం నరేందర్ రెడ్డిని, ఆయన కుమారులను వేర్వేరుగా విచారించిన ఈడీ పలు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది
తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో రేవంత్ రెడ్డి ని ఓటుకు నోటు కేసులో గట్టిగా ఇరికించిన అధికార పార్టీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ కేసును తెరమీదకు తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ రెడ్డిని మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది. అంతేకాదు వేం నరేందర్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ఎదుట పెట్టి మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంపైనా ఆరా తీస్తోంది ఈడీ బృందం. ఇకపోతే ఇప్పటికే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహలను విచారించిన ఈడీ మరోమారు విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 19న ఈడీ ఎదుట విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ విచారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో తన కుమారులను విచారణకు పిలవడం బాధాకరమని కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయాల్లో అణగదొక్కడాలు ఉంటాయని వేధింపులు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటాయా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఓటుకు నోటు కేసులో ఎలాంటి సంబంధం లేని తన కుమారులను విచారణకు పిలవడం బాధేస్తోందని కంటతడిపెట్టారు.
ఓటుకు నోటు కేసులో మూడున్నరేళ్ల తర్వాత విచారణకు తనను ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆయన ప్రభుత్వం కుట్రపూరిత చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని బయటకు తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article