ఎన్నికలప్పుడే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు. కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. దళితబంధు ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మోసపూరిత మాటలు ఇక చెల్లవన్నారు. ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article