రెమ్డెసివర్ బ్లాకులో 30 వేలు.. ఎందుకు?

Health Minister Eetala Rajender Fired Central Government, He Told that Centre totally failed in Controlling Covid In Our Country. Due to their Wrong Planning There's a huge shortage of Remdesiver injections. Because of this, Rs.3k Remdesiver Injection Getting for 30k in black market.

27
Eetala Rajender Fired Central Government
Eetala Rajender Fired Central Government

కరోనా విషయంలో రాజకీయాలను పట్టించుకోకుండా కేంద్రం చెప్పినట్లు విన్నామని అయినా కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రాలకు ఇప్పటి వరకు చేసింది ఏమీలేదని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రాలకు అధికారం- ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అన్ని కేంద్రం అధీనంలోనే పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ లేకుండా మరణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకే కాకుండా- పక్కన ఉన్న నాలుగు రాష్ట్రాలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. టీఆరెస్ ప్రభుత్వం పై తప్పులు మాటలు- తప్పుడు విమర్శలు చేయొద్దని హితువు పలికారు.

  • హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ప్రతి మూడు రోజులకు ఒకసారి రక్త పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. రిమ్స్- నల్గొండ- అసిఫాబాద్- జగిత్యాల్-జనగామ- జోగులంబ- కొత్తగూడెం- మెదక్- ములుగు- సిరిసిల్ల- సంగారెడ్డి- వికారాబాద్- మహబూబ్ నగర్. ఇలా మొత్తం 19 జిల్లాలో లాబ్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 360 టన్నులు కేంద్రం మనకు కేటాయించింది- 6 వందల మెట్రిక్ టన్నులు కావాలని కేంద్రాన్ని అడిగామని తెలిపారు.
  • దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. కేంద్రం దగ్గర నిధులు లేకపోతే రాష్ట్రాల నుంచి నిధులు అడగాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. రెండిస్విర్ మందుల విషయంలో సరైన ప్రణాళిక కేంద్రం దగ్గర లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 3 వేలకు లభించే రెండిస్విర్ ఇంజక్షన్ 30 వేలు పెట్టినా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here