‘నమస్తే పేపర్ కోసం నా భూమి అమ్మినా’

Eetala Rajender Fired Against Telangana Government and CM KCR. He told that, he sold his land for the sake of Namaste Telangana News Paper and did so many sacrifices since from the TRS Inception. No one is permanent in the power, he said.

138
Eetala Rajender Met CLP Leader Bhatti
Eetala Rajender Met CLP Leader Bhatti

నమస్తే తెలంగాణ పేపర్ పెట్టేందుకు తన భూమి అమ్మి డబ్బులు తెచ్చినా అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేతిలో ఇవ్వాళ రాజ్యం ఉండొచ్చు.. వ్యక్తులు ఉంటరు.. పోతరు ధర్మం అనేది ఉంది.. మన దేశంలో రాజ్యం చాలా గొప్పది శక్తివంతమైనదని అన్నారు. తెలంగాణ భవన్ కోసం పోరాటం చేసిన గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కేసీఆర్- ఈటెలకు మధ్య దూరం ఎందుకు వచ్చిందో తమకు మాత్రమే తెలుసన్నారు. మంత్రులు- ఎమ్మెల్యేలు సీఎం దగ్గర గౌరవంతో ఉన్నామని చెప్పలేరని బాంబు పేల్చారు. చావును అయినా భరిస్తా తప్ప ఆత్మగౌరవం వదులుకోనని స్పష్టం చేశారు.

  • కొన్నవాళ్ళు-అమ్మిన వాళ్ళు లేకుండా కలెక్టర్ ఎలా భూములను కొలుస్తారు? అని ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఈటెల రాజేందర్ పేరు ఎలా పెడతారని నిలదీశారు. అధికారులకు వాయి వరుసలు లేకుండా నివేదిక ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కి ఎవ్వరూ ఎదురు చెప్పలేరు కాబట్టి తనపై కేసులు పెట్టె అధికారం సీఎం కి ఉంటది. అయినా, అధికారం ఉన్నది కదా అని ఏది చేస్తే అది నడువదు. రాష్ట్రంలో ఎన్ని సంస్థల్లో అసైన్డ్ భూములను బయటకు ఎందుకు లాగలేదని నిలదీశారు. అచ్చంపేట అసైన్డ్ ల్యాండ్ విషయంలో కోర్టుకు వెళ్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here