కెసిఆర్ గద్దె దించుడే మనందరి పంతం

 • స్థానికులను వదిలిపెట్టి పరాయి వాళ్లకు సహాయం
  * కెసిఆర్ గద్దె దించుడే మనందరి పంతం
  * ఈటల రాజేందర్
  యాదాద్రి:యాదాద్రి భువనగిరి తుర్కపల్లి మండల కేంద్రంలో బీజేపీ లో చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, , బూడిద బిక్షమయ్య గౌడ్, దాసరి మల్లేశం, పివి శ్యామ్ సుందర్ రావు, రాఘవుల నరేంద్ర, పిట్టల అశోక్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గోన్నారు.
  ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న దగ్గర బస్సు ప్రమాదంలో 67 మంది చనిపోయారు వారికి ఇప్పటికీ సాయం అందలేదు. రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే దిక్కులేదు. కానీ మన సొమ్ము తీసుకువెళ్ళి పంజాబ్ లో పంచిపెడుతున్నారు. ఈయన ఉంది మన కొసమా? .. మంది కోసమా? ఇక్కడ ప్రజలు కనిపించడం లేదా కెసిఆర్.. ఎక్కడో ఎలగ బెడతా అని పోతున్నారు. కెసిఆర్ గద్దె దించుడే మనందరి పంతం. హుజూరాబాద్ తీర్పు రాష్ట్రమంతా పునరావృతం కానుంది. కెసిఆర్ ఎన్నికల కోసం15 వేల కోట్ల రూపాయలు తీసి పక్కన పెట్టారట.. అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచి, మద్యం తాగించి ఓట్లు అడుగుతారట. ఆయన ఇచ్చేవి ఇంట్లో నుండి తెచ్చి ఇవ్వడంలేదు తీసుకుందాం.. మనకి ఓటు వేసుకుందాం. కాంగ్రెస్ కి ఓటు వేసినా తెరాస కి వేసినట్టే.. కెసిఆర్ నామరూపాలు లేకుండా పోవాలి అంటే బీజేపింకే ఓటు వేయాలి. బీజేపీ మాత్రమే కెసిఆర్ తో బరిగీసి కొట్లడుతుందని అన్నారు.
  బీజేపీ కి అధికారం కనుచూపుమేరలో ఉంది. మన ముంగిట్లో ఉంది. మనం ప్రజల్లో ఉన్నాం. ఇక్కడ ఎగిరింది కాషాయ జెండానే. తుర్కపల్లి తాగునీటికి అల్లాడుతుంది. తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వలసలు ఆగిపోతాయి అనుకున్నాం. జెండాలు పక్కనబెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో కెసిఆర్, ఆయన కుటుంబం బాగుపడింది తప్ప.. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ నీళ్ళు ఇక్కడికి వస్తాయి అని సంతోష పడుతుంటే… కెసిఆర్ పంటలు వేయవద్దు అని హుకుం జారీ చేశారు. దేశంలో ఎక్కడా ఇలా లేదు. పంటలు వేయకుండా ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టారు కెసిఆర్. పండిన పంట అమ్ముకోవడానికి లేదు. క్వింటాల్ కి 10 కేజీలు కోత పెడుతున్నారు. మిల్లుకు పంపితే వారం రోజులపాటు కూడా దిగుమతి కావడం లేదని అన్నారు.
  కెసిఆర్ కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, పెన్షన్ ఇస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మన డబ్బులు మనకే ఇస్తున్నారు. లిక్కర్ ఛార్జీలు పెంచి.. మద్యం అమ్మి కెసిఆర్ సంపాదిస్తున్నారు. కెసిఆర్ బుకాయిస్తుంటే మనం వింటున్నాం. మద్యం మీద సంపాదిస్తున్న 40 వేల కోట్ల వెనుక అనేకమంది తల్లుల తెగిన పుస్తెలు ఉన్నాయి. కష్ట పడ్డ సొమ్ము కొల్లగొడుతున్నారు. 6.80 లక్షల మంది తెలంగాణలో తాగుడికి బానిసయ్యారు అని ఒక సర్వే రిపోర్ట్. ఇంతమంది మహిళల పుస్తెలు త్వరలో తెగబోతున్నాయి. నిరుద్యోగ భృతి ఇస్త అని మాట ఇచ్చి తప్పి నిరుద్యోగ యువకుల కళ్ళలో మట్టి కొట్టారు కెసిఆర్. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు.. కానీ 60 ఏళ్లు నిండిన వారికే ఇవ్వకుండా తాళం వేసి పెట్టుకున్నారని అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన వాసాలమర్రి తో పాటు అన్ని గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలకు కాషాయ జెండా కప్పి పార్టీలోకి ఈటల ఆహ్వానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article