ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

కరోనా నెపం పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అణచివేసే ప్రయత్నం యధేచ్చగా కొనసాగుతుందని ఈటల రాజేంద‌ర్ అన్నారు.ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడున్న పోలీస్ అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తూ వారికి మాత్రమే రక్షణ ఇస్తూ.. వారి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. ప్రజల కోసం పని చేసే పార్టీలను మాత్రం గొంతు నొక్కే ప్రయత్నం చేయటం దారుణమ‌న్నారు. నల్లగొండలో ముఖ్యమంత్రి పర్యటన సమయంలో, కేటీఆర్ పర్యటన సమయంలో వందలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు, అప్పుడు లేని నిభందనలు ఇప్పుడు ప్రతిపక్షాలకు మాత్రం ఎలా వర్తిస్తాయని నిల‌దీశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..

గత కొద్ది రోజులుగా టీచర్లు, ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతుంటే, బావురుమని బెంగటిల్లి చనిపోతుంటే పట్టించుకోరు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం రెండు విషయాల‌పై దృష్టి సారించాలి. సీనియారిటీ నిర్ధారణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. స్థానికత‌ పాటించాలి. కానీ వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. వారి మాట వినే నాథుడే లేడు. టీచ‌ర్ల‌ పక్షాన బండి సంజయ్ కరీంనగర్ లో తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తూ ఉంటే.. వాటర్ కెనాల్ కొట్టడం, గ్యాస్ కట్టర్లతో  గేట్లు కట్ చేయడం. బీభ‌త్సం సృష్టించడం.. భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వం యొక్క కృరత్వానికి నిదర్శనం. ఇది ఎల్లకాలం చెల్లదు. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ ఎలా ఇస్తుందో ఈ ప్రభుత్వం కూడా అంతే . ఈ రోజు మీరు అణచి వేయవచ్చు. కానీ రాబోయే కాలంలో మీకు చేదు అనుభవం తప్పదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article