మార్చి మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్

Election Schedule on March first weak .. ఏర్పాట్లలో ఈసీ

సార్వత్రిక ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఎన్నికల నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు అలాగే ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే విషయమై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగియనుంది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లడంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. 2019లోకి అడుగుపెట్టడంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఏపీలోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ మార్చి తొలి వారంలో ప్రకటించనుందనే వార్త బయటకొచ్చింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఏ నెలలో ఎన్నికలు జరపాలనే విషయమై నిర్ణయం తీసుకునే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. 2014లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5న ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో 9 దశల్లో ఎన్నికలు నిర్వహించారు.
భద్రతా దళాల లభ్యత, వాతావరణ పరిస్థితుల సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీలు ఖరారు చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయమై మాత్రం ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటే అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తోందని సమాచారం. జూన్ 18తో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు కూడా జూన్లోనే ముగియనుంది. సిక్కిం ప్రస్తుత అసెంబ్లీ మే 27 వరకు పని చేస్తుంది. ఇక గత ఎన్నికల షెడ్యూల్ చూస్తే 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఏప్రిల్ మే నెలల్లో 9 విడతలుగా పోలింగ్ నిర్వహించింది. ఏప్రిల్ 7న తొలి విడత పోలింగ్ చేపట్టిన ఈసీ మే 12 వ తేదన తుది విడత పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియను ముగించింది. ఈ నేపధ్యంలో మార్చ్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article