ELECTIONS IN 9 PHASES
- మార్చి 4 తర్వాత షెడ్యూల్
- ఈనెల 28లోగా ప్రధాన నిర్ణయాల అమలుకు కేంద్రం యోచన
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలను ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలిసింది. మార్చి 4వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 9 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. లోక్ సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. 4వ తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈనెల 28లోగా పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది.