విశాఖ బీచ్ కు సొబగులు

విశాఖపట్నం:రాబోయే రెండు మూడు నెలల్లో విశాఖ బీచ్ ను దేశంలోనే సుందరమైన బీచ్ గా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసిపి విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి వై వి సుబ్బారెడ్డి తెలిపారు. బీచ్ రోడ్ లో ఉదయం జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. బీచ్ ను మరింత సుందరంగా, పరిశుభ్రంగా ఉంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వాకర్స్ ను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ బీచ్ ను దేశంలోని సుందరమైన బీచ్ గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం సీఎస్ఆర్ కింద పలు కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. బీచ్ లో సంపూర్ణంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలియజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article