ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయకూడదు

Employees Shouldn’t Dictate Government Says KCR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలన్నారు. గతంలో ఉద్యోగులు ప్రభుత్వాలను డిక్టేట్ చేసే పరిస్థితులుండేవని, ఇక నుంచి అలా ఉండదన్నారు. శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనిని ఉద్యోగులు చేయాలన్నారు. అంటే, ప్రతిఒక్కరూ పారదర్శకంగా పని చేయాలని, అవినీతి రహితంగా పని చేయాలని కోరారు. ఎవరి పని వారు కచ్చితంగా చేయాలా.. ఎవరికి నిర్దేశించిన పనిని వారు తప్పకుండా చేయాలె. లేకపోతే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరించారు. అలా కాకుండా, మేం గీ పనే చేస్తం.. మేం గా పనే చేస్తం.. అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయకూడదు. అది కరెక్టు విధానం కాదు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కుక్క తోక నూపుతదా? తోక కుక్క నూపుతదా? అనేది అర్థం చేసుకోవాలన్నారు. చట్టాలు ఉద్యోగులు చెప్పినట్లు చేస్తే.. ఇక శాసనసభ ఎందుకని ప్రశ్నించారు. చట్టాలు శాసనసభ చేస్తది. చేసే ముందు తప్పకుండా చర్చిస్తుంది. మాట్లాడుతుందన్నారు. ఎవరో చెప్పిన మాటలను నమ్ముకుని రెవెన్యూ ఎంప్లాయిస్ పిచ్చి సమ్మెలు చేస్తే వారే బజారున పడతారని హెచ్చరికలు జారీ చేశారు.

అవసరమైతే వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తాం. ప్రజల్ని పీడిస్తే తప్పకుండా తొలగిస్తాం. పట్వారీ వ్యవస్తను పక్కన పెట్టేలదా? అది పోయిన తర్వాతే వీఆర్వో వ్యవస్థ వచ్చింది కదా.. వీళ్లు కూడా పట్వారీల కంటే డబుల్, ట్రిపుల్ మోసం చేస్తే ఎలా? అందుకే, అవసరమైతే తొలగిస్తం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పంచాయతీ రాజ్ చట్టం తెచ్చాం. చాలా కఠినంగా ఉంటామన్నారు. సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ అట్లగే ఉంటది. భారతదేశంలో ఎవరికీ చెక్ పవర్ లేదు. అయినా సర్పంచులకు చెక్ పవర్ ఉంది. ఉప సర్పంచులు, స్టాండింగ్ కమిటీలతో కలిసి ఆ ఊర్లను డెవలప్ చేయాలని కోరామని వివరించారు. కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినం. కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తం. ఎవరైనా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు.

Telangana Cm KCR Ultimatum

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article