నేను రాను సినిమాకు!

40
#Empty Theartres#
#Empty Theartres#

#Empty Theartres#

అన్ లాక్ నిబంధనల్లో భాగంగా సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. థియేటర్ల యజమానులకు ఊరట కల్గించే విషయమే అయినా.. ప్రేక్షకులు మాత్రం ఇప్పుడే థియేటర్లకు వెళ్లాలనుకోవడం లేదు. ఇదే విషయమై లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ సర్వే కూడా చేసింది. ఆ సర్వే థియేటర్లలో సినిమా చూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు చాలామంది. దేశవ్యాప్తంగా 8274 మంది అభిప్రాయాలు సేకరించగా.. వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

వీరిలో 4 శాతం మంది కేవలం కొత్త సినిమా రిలీజ్‌ అయితే మాత్రమే వెళ్తామని చెప్పగా, 3 శాతం మంది.. కొత్త, పాత అనే తేడా లేకుండా థియేటర్‌లో ఏ సినిమా అయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. భారీ వర్షాలు, కరోనా ప్రభావం తగ్గకపోవడంతో చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారని స్పష్టమైంది. వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రానందున ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతున్నట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here