వచ్చే నెలలో ఈఎన్ టీ, దంత పరీక్షలు

ENT EXAMINATION FROM NEXT MOTH

· శ్రవణం, దంతక్రాంతి పేర్లను పరిశీలిస్తున్న అధికారులు

· ఉపకరణాలన్నీ ఉచితంగానే ఇచ్చే యోచన

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడం.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓట్లు కురిపించడంతో ప్రజల ఆరోగ్యంపై సర్కారు దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ ప్రధానంగా వైద్యపరమైన విషయాలను ప్రస్తావించారు. కంటివెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాటిపై దృష్టిపెట్టింది. వచ్చే నెల నుంచి ఉచితంగా ప్రారంభించాలని భావిస్తున్న చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) పరీక్షలకు ‘శ్రవణం’ అని, దంత వైద్య పరీక్షలకు ‘దంతక్రాంతి’ అని పేర్లు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. కంటి వెలుగు పథకం కింద ప్రజలకు రీడింగ్‌ గ్లాసులు, చత్వారీ కళ్లద్దాలను ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం… ఈఎన్‌టీ, దంత వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో ఎవరికైనా ఉపకరణాలు ఇవ్వాల్సి వస్తే వాటిని కూడా ఉచితంగానే ఇవ్వాలని యోచిస్తోంది. వినికిడి లోపంతో బాధపడే వారికి వినికిడి యంత్రం ఉచితంగానే ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే చెవికి సంబంధించిన కాక్లియర్‌ ఆపరేషన్‌ ఉచితంగా చేయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు రూ.6 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా వాటిని ఉచితంగా చేయించాలని భావిస్తోంది. ఇక దంత సమస్యలకు సంబంధించి పుచ్చిపోయిన పళ్లను తీయడం, కొత్త వాటిని అమర్చడం వంటి చికిత్సలను గ్రామాల్లో చేసే పరిస్థితి ఉండదు. దీంతో వాటన్నింటినీ నిర్దేశించిన ఆసుపత్రులకు రిఫర్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆయా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article