మంచివాడు మరీ అంత మంచిగా ఏం లేడే..

162
Entha Manchi Vadavura Trailer
Entha Manchi Vadavura Trailer

Entha Manchi Vadavura Trailer Review and Talk

కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన సినిమా ఎంతమంచివాడవురా. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 15న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకూ పండగ మూమెంట్ లో ఎంతో కొంత ఆకట్టుకుంటాడీ మంచి వాడు అనుకున్నవాళ్లు ట్రైలర్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఏ మాత్రం ఆకట్టుకోలేని విధంగా ట్రైలర్ కట్ చేశారు. అస్సలే మాత్రం కొత్తదనం కనిపించడం లేదీ ట్రైలర్ లో. ఇప్పటి వరకూ వచ్చిన గోదావరి జిల్లాల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు మించి కొత్తగా ఏం కనిపించడం లేదు.
ఇంతకు ముందు శతమానం భవతిలో కుటుంబ బంధాల గురించి సీరియల్స్ రేంజ్ లో చెప్పాడు దర్శకుడు. తర్వాత శ్రీనివాస కళ్యాణంలో హీరో  చేత ఇప్పించిన ‘మోటివేషనల్ క్లాస్’ థియేటర్స్ లో హాహాకారాలు వినిపించాయి. అయితే ఈ సారి మోటివేషన్స్ తో పాటు కాస్త ఎమోషన్స్ మరికాస్త యాక్షన్ ను కూడా రంగరించినట్టు కనిపిస్తోంది. బట్.. అందులోనే ఆకట్టుకునే అంశాలేవీ కనిపించడం లేదు.

అందమైన హీరోయిన్ తనను ప్రేమించమని కళ్యాణ్ రామ్ వంటి హీరో వెంటపడటం ట్రైలర్ లోనే మెప్పించలేకపోయింది. ఎంతమంచివాడైనా హీరో లవబుల్ గానూ ఉండాలి కదా.. ఏదేమైనా ఇప్పటి వరకూ ఉన్న మంచి ఇంప్రెషన్ ను ట్రైలర్ పెంచలేకపోయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Entha Manchi Vadavura Trailer Review and Talk,Kalyan Ram,#kalyanram,Satehesh Vegnesh,NTR,Pre Release Event,Talk Of Entha Manchi Vadavura,Sankranthi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here