మూర్చ‌రోగులు కోవిడ్ టీకా వేసుకోవ‌చ్చు

62
Female patient with protective face mask looking at her arm while doctor in protective gloves is injecting flu vaccine

Epilepsy patients can take Covid-19 vaccine

– మూర్చ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకే అంత‌ర్జాతీయ ప‌ర్పుల్ డే
– ఎస్‌ఎల్‌జి ఆస్ప‌త్రుల‌ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమా కందుకూరి

హైదరాబాద్, మార్చి 26, 2021: ప‌ర్పుల్ డే

మూర్ఛ అనేది అంద‌రిలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వ‌య‌స్సులు గ‌ల ప్ర‌జ‌ల్లోనూ ప్ర‌భావం చూపే అత్యంత సాధారణ నాడీ స‌మ‌స్య‌. కానీ మూర్చ ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్ల‌కు చాలా అపార్థాల‌కు, రుగ్మ‌త‌ల‌కు కార‌ణ‌మ‌య్యే విధంగా త‌రుచుగా సంభ‌విస్తూ ప్ర‌వ‌ర్త‌నా ప‌రంగా ఒంటరిని చేస్తూ అనేక స‌వాళ్ల‌ను విసురుతోంది.

మూర్చ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌( డ‌బ్ల్యూహెచ్‌వో) వారు ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌ర్పుల్ డే అనే కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ఇలా ప‌ర్పుల్ డేను మూర్చ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించే రోజుగా జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో అందుకే ప్ర‌తి ఒక్క‌రూ మూర్చ‌వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి. మూర్చ‌వ్యాధితో బాధ‌ప‌డే వ్యక్తులు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడానికి నిస్సందేహంగా ముందుకు రావాలి. టీకా మూర్చ‌వ్యాధి ఉన్న వారికి మూర్చ పెంచ‌డం, కానీ త‌గ్గించ‌డం కానీ ఎలాంటి న‌ష్టం క‌ల్గించదు. ఈ నేప‌థ్యంలో మూర్చ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి కోవిడ్ -19 మరియు వ్యాక్సిన్లపై అవగాహన క‌ల్పించ‌డానికి ఎస్‌ఎల్‌జి ఆస్ప‌త్రి ల‌క్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తోంది.

ఈ విషయంపై ఎస్‌ఎల్‌జి ఆస్ప‌త్రుల‌ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమా కందుకూరి మాట్లాడుతూ “మూర్ఛ ఉన్నవారికి కోవిడ్ -19 సంక్రమించే ప్రమాదం లేదా దాని నుంచి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం లేదు. ఏదేమైనా, మూర్ఛ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డే వారు కోవిడ్ -19 ను నియంత్రించ‌డానికి వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇష్టపడరు. ముందుగానే చెప్పుకున్న‌ట్లు కోవిడ్ టీకా తీసుకుంటే మూర్ఛ ఉన్నవారిపై దుష్ప్రభావం చూపుతున్న‌ట్లు ఎటువంటి ఆధారాలు లేవు. మిగ‌తా టీకాల మాదిరిగానే కొంతమంది వ్య‌క్తుల‌కు జ్వ‌రం కూడా రావ‌చ్చు. ఇది కొంత‌కాలానికే త‌గ్గిపోతుంది. ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.” అని వివ‌రించారు.

“కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న‌తరువాత ఎవ‌రికైనా జ్వ‌రం అనేది ఒక సాధారణ స‌మ‌స్య‌గా గుర్తించారు. టీకా వేయ‌గానే శరీరంలోని రోగనిరోధక శక్తి కొత్త శ‌క్తిని త‌యారు చేసుకోవడానికి ప్రతిస్పందిస్తుంది. దాని వ‌ల్ల కూడా జ్వ‌రం రావ‌చ్చు. అదే విధంగా మూర్ఛతో బాధపడుతున్న కొంతమందికి జ్వరం వ‌ల్ల కూడా సంభ‌వించే మూర్చ అయిన‌ప్ప‌టికీ కోవిడ్ -19 వ్యాక్సిన్ల భద్రత గురించి అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఇప్పటికీ టీకా ఎంతో ర‌క్ష‌ణాత్మ‌క‌మైన‌దిగా సూచిస్తుంది. అయితే కోవిడ్ -19 వ్యాక్సిన్లలో జోక్యం చేసుకోని సమర్థవంతమైన మందులు ఉన్నాయి. అందుకే దేశ మ‌రియు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డి సాధారణ స్థితికి రావడానికి టీకాలు వేయించుకోవ‌డం ముఖ్యం ”అని డాక్టర్ సుమా కందుకూరి తెలిపారు.

టీకా తర్వాత కూడా మాస్కులు, చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం, సామాజిక దూరం వంటి ముందు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఈ క‌రోనా మహ‌మ్మారిని నియంత్రించ‌డం ఎంతో ముఖ్యం. క‌రోనా ను నిర్మూలించ‌డానికి అన్ని ర‌కాలైన సాధ‌నాల‌ను ఉప‌యోగించాలి. క‌రోనా వ్యాక్సిన్ ఇత‌ర వ్యాక్సిన్స్ మాదిరిగానే ప‌నిచేస్తోంది. మూర్ఛతో సహా ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌నైనా పరిష్కరించడానికి శాస్త్రీయ మరియు డాక్ట‌ర్ల‌పై న‌మ్మ‌కం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here