చంద్రబాబుతో భేటీకు డుమ్మా కొట్టిన ఏరాసు

Spread the love

ARASU was Absent for Chandrababu Meet – గౌరు ఎఫెక్ట్

ఆమె రాక పార్టీ లో ఉన్న ఆనేతకు అసలు నచ్చలేదు. మొదటినుండి ఉప్పు నిప్పులా ఉన్న వారు ఒకే పార్టీలో ఇమడాలంటే సాధ్యం కాదని పార్టీ శ్రేణుల్లో ఒక భావన ఉంది. గౌరు చరితా రెడ్డి దంపతులను పార్టీలోకి ఆహ్వానించడం పట్ల మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం చంద్రబాబుతో జరిగిన కర్నూలు జిల్లా పార్టీ నాయకుల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఏరాసు ప్రతాపరెడ్డి 1994లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో టీడీపి తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెసు నుంచి 2004లో విజయం సాధించారు. 2009 శ్రీశైలం నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏరాసు ప్రతాపరెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ స్థితిలోనే ఆయన కాంగ్రెసును వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు గౌరు రాక ఎఫెక్ట్ ఏరాసు అసంతృప్తి ఎఫెక్ట్ చంద్రబాబుకు ఎలా ఉండబోతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *