అప్పుడు  చంద్రబాబునే  బెదిరించా అన్న ఎర్రబెల్లి

errabelli about chandrababu
తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ఉద్యోగులను తాను ఎప్పుడు ఏమీ అనలేదని, తనను తెలంగాణ ద్రోహి అంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం తాను జైలుకు వెళ్లానని.. ఈ విషయం వాళ్లకు తెలుసో? లేదో? అని అన్నారు. తెలంగాణ కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును బెదిరించి లెటర్‌ అడిగానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మిక పక్షపాతని, తాను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటానని మంత్రి స్పష్టం చేశారు.తనపై కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఆర్టీసీ నాయకులు కార్మికులను తప్పుడు తోవలో నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల ట్రాప్‌లో ఆర్టీసీ కార్మికులు పడ్డారన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు.

tags : telangana,rtc strike , minister , errabelli dayakar rao , chandrababu, telangana movement letter
http://tsnews.tv/ap-raithu-bharosa/
http://tsnews.tv/srireddy-hot-comments-on-byreddy-siddarth-reddy/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *