లోకేష్ లా, రాహుల్ గాంధీలా కేటీఆర్ అసమర్ధుడు కాడు

122
Errabelli Comments Rahul Lokesh
Errabelli Comments Rahul Lokesh

Errabelli Comments Rahul Lokesh

కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని ఆయన అన్నివిధాల సమర్థుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పేర్కొన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని ఇక ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆయన పేర్కొన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్  సీఎం ఎప్పుడవుతారో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని దయాకర్‌ రావు తెలిపారు.

వరంగల్ జిల్లాలో  వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపలేదా, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించవద్దని ప్రశ్నించారు. కేటీఆర్‌.. చంద్రబాబు కొడుకు లోకేష్‌, సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీలా అసమర్థుడు కాదని తీవ్ర  వ్యాఖ‍్యలు చేశారు.

ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి విమర్శించారు. గతంలో అసెంబ్లీ చర్చల సందర్భంలో తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ ని ప్రజలు  రానున్న మునిసిపల్ ఎన్నికల్లో  ఆదరిస్తారని చెప్పిన ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రశంసలు చేశారు.

Errabelli Comments Rahul Lokesh,palle pragathi, vardhannapet, errabelli dayakar rao, congress leader,  rahul gandhi, lokesh  , municipal elections, ktr,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here