మున్సిపల్ ఎన్నికల బిజీలోనూ దుక్కి దున్నిన మంత్రి…

135
BJP POWER POLITICS
BJP POWER POLITICS

Errabelli Dayakar Rao About Municipal Elections

తెలంగాణా గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ ఎన్నికల హడావిడిలోనూ తాను రైతునే అని విషయం అందరికీ అర్ధం అయ్యేలా చేశారు . తెలంగాణలో పొలిటిషన్స్ ఇప్పుడు  చాలా బిజీగా ఉన్నా ఎర్రబెల్లి మాత్రం పొలం దున్ని అన్నం పెట్టే భూమిని మర్చిపోవద్దని చెప్తున్నారు . ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై దిశానిర్దేశం చేశారు. అయితే ఓ తెలంగాణ మంత్రి మాత్రం ఈ ఆదివారం చాలా  ప్రశాంతంగా  కనిపించారు. తన సొంత పొలానికి వెళ్లి ట్రాక్టరుతో పొలం దున్నారు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పర్వగిరిలో ఉన్న పొలంలో కాసేపు కష్టపడిన ఆయన  ఎంత స్థాయికి వెళ్లినా అన్నం పెట్టిన భూమిని మర్చిపోకూడదని చెప్పి తన పొలంలో కాసేపు పని చేసినట్టు చెప్పారు.  ఆ తర్వాత అదే గ్రామంలో కాసేపు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ద్యం, డ్రైనేజ్ పనుల గురించి ఆరా తీశారు. మొత్తానికి వ్యవసాయం చెయ్యటం ఇప్పటికీ మరవలేదని తెలిసేలా ఆయన పొలంలో కష్టపడ్డారు.

Errabelli Dayakar Rao About Municipal Elections,Errabelli dayakar rao, trs party , minister, municipal elections , work in fields , parvatagiri 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here