ఈటెల ఏనాడు ముఖ్యమంత్రిని అడగలేదు

88
Etela Rajender Never Asked for BC
Etela Rajender Never Asked for BC

అధికార పార్టీలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ధి కోసం పాటుపడే లేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గాలి కొదిలేసినారు…ఎక్కడ చూసినా గుంతలు.. మట్టిరోడ్లు దర్శనమిచ్చాయి.. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది…రాజేందర్ గెలిస్తే రాజా సింగ్ , రఘునందన్ పక్కకు ఎమ్మెల్యేగా ఉంటాడు కానీ హుజురాబాద్ నియోజకవర్గo అభివృద్ధి ఆగిపోతుంది. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగలంటే అడగ్గానే వరాలు కురిపించే తెలంగాణ ప్రభుత్వంకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటేసి మద్దతుగా నిలవాలని కోరారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని.. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని.. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారని విమర్శించారు. ఈటల ఇన్ని రోజులు అధికారంలో ఉండి.. ఇపుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పాల‌ని.. గోడ గడియారాలు, కుట్టుమిషన్ లు, ప్రెషర్ కుక్కర్లు పంచి ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.

రాష్ట్ర రాజదానిలో అత్యంత విలువైన కోకాపేట లాంటి ప్రాంతాల్లో40 బీసీ కులాలకు అత్యధ్బుతమైన భవనాలు నిర్మించుకొంటూ ఆత్మగౌరవాన్ని పెంచుకున్నామని, ఈటెల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్ నియోజకవర్గంలోప్రతీ పనిని పూర్తి చేసే బాధ్య‌త‌ను తీసుకుంటామన్నారు. బీసీల సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో సంక్షేమం, అభివ్రుద్ది కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here