ఆ తేదీలోపు  భారత్ వచ్చిన వారికే పౌరసత్వం

exact data for determining the number of eligible refugees for citizenship
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఏఏ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న నేపధ్యంలో బీజేపీ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తూ సీఏఏ ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని, వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్తుంది. ఇక ఇదే సమయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. భారత్ లోకి వచ్చిన శరణార్థులను ఆదుకోవడానికి పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ఒక్క అక్షరం తప్పున్నా మార్చడానికి సిద్ధమని చెప్పారు. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్ లోకి వచ్చిన వారికే పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు.ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించారన్నారు. ఈ చట్టాన్ని అన్ని రకాలుగా ఆలోచించే తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్క కులం, మతం, వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించలేదని స్పష్టం చేశారు. సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

exact data for determining the number of eligible refugees for citizenship,union minister, kishan reddy, CAA, NRC, citizenship,#G Kishan Reddy

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article