నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ అప్రూవల్స్ ..

85
Exhausted arogya Sri Approvals
Exhausted arogya Sri Approvals
Exhausted arogya Sri Approvals
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం.  ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం వందల ఆపరేషన్ లు జరుగుతున్నాయి.  ఈ ఆపరేషన్లకు  ఆస్పత్రిలోని ఆరోగ్య  మిత్రలు  ఆన్లైన్లో దరఖాస్తు  చేస్తారు.   దీంతో రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆపరేషన్ జరగాలన్నా ఆన్లైన్లో అనుమతి లభిస్తుంది.  అయితే అలాంటి కీలక విభాగానికి కరెంట్ కష్టాలు వచ్చిపడ్డాయి.  కురుస్తున్న భారీ వర్షాలకు ఆరోగ్యశ్రీ భవనానికి విద్యుత్తు అందించే ట్రాన్స్ఫార్మర్ పాడై పోవడంతో ఎంతో కీలకమైన ఆ విభాగానికి వారం రోజులుగా కరెంటు లేదు. భారీ వర్షాలకు ట్రాన్స్ఫార్మర్లో సమస్య తలెత్తింది. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఏడు రోజులు గడిచినా సరఫరా  పునరుద్ధరణ కాకపోవడంతో ఆరోగ్యశ్రీ దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్లో పడ్డాయి. దీంతో అప్రూవల్స్ ఆగిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్ సాయంతో రోజూ కొన్ని గంటల పాటు అప్రూవల్స్ ఇచ్చారు. శని, ఆదివారాల్లో కరెంట్ లేక ఒక్క ఆపరేషన్ కూడా అప్రూవల్ఇవ్వలేదు. దీంతో డయాలసిస్, కీమోథెరపీకి సంబంధించి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా పది సైకిళ్లకు ఒకసారి డయాలసిస్ కు అప్రూవల్ ఇస్తారు. తర్వాత మరోసారి అనుమతివస్తే గానీ డయాలసిస్ చేయరు. కరెంట్ లేక అప్రూవల్ రాకపోవటంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రోగి అవస్థ చూడలేక అప్రూవల్ లేకపోయినప్పటికీ అతనికి డయాలసిస్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 నుంచి 700 వరకు అప్రూవల్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం జనరేటర్ సహాయంతో ఆన్ లైన్ లో కొన్ని ఆపరేషన్స్ కు అనుమతులిచ్చారు.  కానీ  ప్రభుత్వ విభాగాన్ని నిర్వహించే భవనానికి వారం రోజులుగా కరెంట్ లేకపోయిన అధికారులు పట్టించుకోకపోవటం  నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ స్కీం కింద ఎమర్జెన్సీ ఆపరేషన్లు నిర్వహించాల్సి వస్తే ఫోన్ ద్వారా అప్రూవల్ మంజూరుచేస్తారు. అయితే, కరెంట్లేక ఫోన్లు కూడా మూగబోవడంతో ఫోన్ల ఆపరేటింగ్ వ్యవస్థ మొత్తాన్ని తాత్కాలికంగా కోఠిలోని 104 సేవల భవనానికి తరలించారు.  ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు మంత్రివర్యులు పట్టించుకోకపోవడం తెలంగాణ రాష్ట్ర పాలన కు అద్దం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.

tags :telangana, arogya sri, approvals, power problem, transformer, rains,

https://tsnews.tv/bjp-target-is-singareni/
https://tsnews.tv/satyam-team-in-boat-extraction-work/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here