సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఈసీ మరోసారి ఆదేశాలిచ్చింది. 4వ విడతలో 10 రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో.. ఈసీ మరోసారి అత్యవసర సమాచారం పంపింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఎక్కడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదని స్పష్టం చేసింది. అన్ని దశల్లో పోలింగ్ ముగిసిన తర్వాత.. అంటే జూన్ 1న చివరి దశలో ఏడో విడుత పోలింగ్ ముగియనుంది. అదేరోజున సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చారు.